ETV Bharat / bharat-news

ఎన్​ఐఏ దర్యాప్తు ముమ్మరం

పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు బాధ్యతలను జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది.

author img

By

Published : Feb 20, 2019, 10:08 PM IST

ఎన్​ఐఏ దర్యాప్తు ముమ్మరం

జమ్మూకశ్మీర్ పుల్వామా బాంబుదాడి దర్యాప్తు కేసును ఎన్ఐఏ వేగవంతం చేసింది. జమ్మూకశ్మీర్​ పోలీసులు నమోదు చేసిన కేసును రీ-రిజిస్టర్​ చేసింది. విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 40మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్​ పోలీసులు అవంతిపొర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలను ఎన్​ఐఏ స్వాదీనం చేసుకుంది. బాంబుదాడి తర్వాత పోలీసుల నిర్బంధంలో ఉన్న పన్నెండు మందిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పేలుడుకు సంబంధించి ఆధారాల కోసం సీనియర్​ పోలీసులు, నిఘా వర్గాలు, ఆర్మీ అధికారులను కలిసినట్లు ఎన్​ఐఏ తెలిపింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.