జమ్మూకశ్మీర్ వేర్పాటువాదుల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. పాకిస్థాన్ నుంచి హవాలా మార్గాల ద్వారా ధనార్జన చేశారన్న అనుమానాలతో ఈ తనిఖీలు చేసింది.
మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, నయిూమ్ గీలానీ, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) నేతలు యాసిన్ మాలిక్, షబీర్ షా, అష్రఫ్ సెహ్రాయ్, జాఫర్ భట్ నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు.
స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో జమ్మూకశ్మీర్ వ్యాలీలోని తొమ్మిది ప్రదేశాల్లో తనిఖీలు చేశారు అధికారులు.