మహారాష్ట్రలో ఆరేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. సోమవారం పుణేలోని అంబెగాన్లో బోరుబావిలో పడిన రవి పండిట్ అనే బాలుడిని 16 గంటల పాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.
కొన్ని రోజుల క్రితం అంబెగాన్ ప్రాంతంలో 200 అడుగుల లోతు బోరుబావిని తవ్వారు. సోమవారం బోరు సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అందులో పడిపోయాడు. 10 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడిని రక్షించారు.