సీబీఐ షిల్లాంగ్ కార్యాలయంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ విచారణ వరుసగా నాలుగో రోజు సాగింది. శారదా కుంభకోణం కేసులో సాక్ష్యాల అవకతవలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నిస్తోంది.
రాజీవ్‌కుమార్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత కునాల్ ఘోష్ ఆది, సోమవారాల్లో విచారణకు హాజరయ్యారు. ఆయన తిరిగి కోల్‌కతాకు వెళ్లారు.
రాజీవ్‌కుమార్‌ను గత మూడు రోజుల్లో 24 గంటలకు పైగా ప్రశ్నించింది సీబీఐ. రోజ్‌వ్యాలీ, శారదా కుంభకోణాల విచారణలో సీబీఐకి సహకరించాలని రాజీవ్‌కుమార్‌ను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. షిల్లాంగ్‌ను తటస్థ వేదికగా ఎంపిక చేసిన న్యాయస్థానం... రాజీవ్‌కుమార్‌ను అరెస్టు చేయకూడదని సీబీఐని ఆదేశించింది.
ఫిబ్రవరి 3న రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించటానికి ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ.