రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన రెండు, మూడు నెలల్లోనే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రాకేష్ సింగ్. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి రాష్ట్రంలో అధికారం దక్కించుకుందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో విభేదాలున్నాయని రాకేష్ సింగ్ వెల్లడించారు.
సింగ్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రతినిధి నిలభ శుక్లా ఖండించారు. తీవ్ర ఒత్తిడి, నిరుత్సాహంలో ఉన్నందునే రాకేష్ సింగ్ అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భాజపా వలకు కాంగ్రెస్ చిక్కదని, తమ ఎమ్మెల్యేలు భయపడరని తేల్చి చెప్పారు.