ETV Bharat / bharat-news

గీతారాధనలో మోదీ

దిల్లీలోని ఇస్కాన్​లో ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

author img

By

Published : Feb 26, 2019, 6:23 PM IST

గీతారాధనలో మోదీ

దిల్లీలోని ఇస్కాన్​ ఆధ్వర్యంలో జరుగుతున్న గీతారాధన వేడుకలకు హాజరయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఇందుకోసం రైలు మార్గం ఎంచుకున్నారు. దిల్లీ ఖాన్​ మార్కెట్​లో మెట్రో ఎక్కారు మోదీ. ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ ప్రయాణం సాగించారు.

ఇస్కాన్​లో అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించి, పూజలు నిర్వహించారు మోదీ.

అతిపెద్దది...

800 కేజీల బరువు, 670 పేజీలతో ఇస్కాన్​ సంస్థ ఈ భగవద్గీతను రూపొందించింది. 700 సంస్కృత పద్యాలు పొందుపరిచింది. దీని పొడవు 2.8 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. ప్రపంచంలో అతి పెద్ద మత గ్రంథం ఇదేనని చెప్పింది ఇస్కాన్.

భగవద్గీత ముద్రించడానికి యుపో సింథటిక్​ కాగితాన్ని వాడారు. మిలాన్​, ఇటలీ భాషల్లో దీన్ని ముద్రించారు. వివిధ చిత్రాలు, బొమ్మలతో భగవద్గీతను ఆకర్షణీయంగా రూపొందించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.