దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లోని యోన్సై విశ్వవిద్యాలయంలో మహత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మహాత్ముడి సేవలను మోదీ స్మరించుకున్నారు. గాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుగుతుండగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరయ్యారు.
ఉగ్రవాదం, వాతావరణ మార్పులే మనవాళికి అతిపెద్ద సమస్యలని ప్రధాని మోదీ అన్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి మహాత్ముడి ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయని స్పష్టం చేశారు.
"ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళి రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి ఉగ్రవాదం... రెండోది వాతావరణ మార్పులు. ఈ రెండు సమస్యలకు పరిష్కారాలు గాంధీ జీవితం, ఆయన ఆదర్శాలు, ఉపదేశాల్లో వెతుక్కోవచ్చు."
-- నరేంద్ర మోదీ , ప్రధానమంత్రి.
ఇదీ చూడండీ..."ఆర్థికంలో భారత్ భేష్"