భక్తి ఉద్యమం నాటి ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా కులవివక్షకు చరమగీతం పాడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారణాసిలో డీజిల్ లోకోమోటివ్ నుంచి ఎలక్ట్రిక్ లోకోమోటివ్కు మార్చిన మొదటి ఇంజిన్ను మోదీ ప్రారంభించారు.
"దేశంలో కులవివక్ష అంతం కావాలని గురువు రవిదాస్ ఆశించారు. ఈ వివక్ష ఉన్నంత కాలం ప్రజలు కలిసి ఉండలేరు. సమాజంలో సామరస్యం, సమానత్వం సాధ్యం కావు. సమాజంలో గుర్తింపు కోసం, సొంత ప్రయోజనాల కోసం కులాలను సృష్టించారు. వాటిని పెంచి పోషిస్తున్నారు. "
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
గురూజీ రవిదాస్ భోదించిన ఐదు ధర్మాలపై భాజపా ప్రభుత్వం దృష్టి పెట్టిందని మోదీ తెలిపారు. కులంతో సంబంధం లేకుండా విద్య, ఆదాయం, వైద్యం, వ్యవసాయం, ప్రజల కష్టాలకు స్పందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ఎంతో కృషి చేశామని, 'నడుస్తుంది లే' అనే మనస్థత్వాన్ని మా ప్రభుత్వం మార్చిందని ఉద్ఘాటించారు.