దిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ యువ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ముగ్గురు విద్యార్థులకు యువ అవార్డులు ప్రదానం చేశారు మోదీ. ఇదే వేదికపై ఖేలో ఇండియా యాప్‌ను ప్రారంభించారు. అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు ప్రధాని.
"16వ లోక్‌సభ కాలంలో ఉత్పత్తి 85శాతం పెరిగింది. 205 బిల్లులు ఆమోదం పొందాయి. 15వ లోక్‌సభతో పోలిస్తే 20 శాతం అధికంగా పని చేశాం. దీనిపై సంతోష ఏం లేదు. 200 శాతంగా ఉంటే బాగుండేది. పూర్తి మెజారిటీ ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. రాజ్యసభలో ఏమైంది. అది పెద్దల సభ. అక్కడ ఫలితం తిరగబడింది. కేవలం 8శాతం మాత్రమే మెరుగుపడింది. " -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి