రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పును సమీక్ష చేయాలంటూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు వాదనలు విననుంది.
మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వేసిన పిటిషన్లో తీర్పును సమీక్షించటంతో పాటు వాదనలు ఓపెన్ కోర్టులో జరగాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ దాఖలు చేసిన మరో పిటిషన్లో కేవలం తీర్పు సమీక్షించాలని కోర్టుకు విన్నవించారు.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలు కొనుగోలుకు చేసుకున్న రూ. 58వేల కోట్ల విలువున్న ఒప్పందంపై దర్యాప్తు చేయాలన్న పిటిషన్లను ఫిబ్రవరి 14న తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.