ETV Bharat / bharat-news

'మిరాజ్ '​ సింగ్​ రాఠోడ్ - RAJASTHAN

జమ్ముకశ్మీర్​లో జైషే మహమ్మద్​ ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది మిరాజ్​-2000 యుద్ధ విమానం. ఈ వైమానిక అస్త్రానికి గుర్తుగా రాజస్థాన్​కు చెందిన మహవీర్​ సింగ్​ రాఠోడ్​ తన బిడ్డకు 'మిరాజ్​ సింగ్ రాఠోడ్​'​ అని పేరు పెట్టారు.

'మిరాజ్ '​ సింగ్​ రాఠోడ్
author img

By

Published : Feb 27, 2019, 3:35 PM IST

జమ్మూకశ్మీర్​లోని జైషే మహమ్మద్​ ఉగ్రమూకల శిబిరాలను నేలమట్టం చేయటంలో ప్రధాన అస్త్రం... మిరాజ్​-2000 యుద్ధ విమానం. బారాకోట్​లో భారత వైమానిక బాంబుదాడులను... పాక్ ఉగ్రమూకల పుల్వమా దాడికి ప్రతీకారంగా భావించిన యావత్​ భారతం సంబరాలు జరుపుకుంది.

అమర వీరుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ, టపాసులు కాలుస్తూ... ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు విజయోత్సవాలు జరుపుకున్నారు. రాజస్థాన్​లోని నాగౌర్​ జిల్లా డాబ్దా గ్రామానికి చెందిన మహవీర్​ సింగ్​ కుటుంబం భారత వైమానిక దాడుల విజయాన్ని మరోలా జరుపుకున్నారు.

మంగళవారం ఉదయం 3 గంటల 30 నిమిషాలకు పాక్​ ఉగ్రమూకల స్థావరాలపై వైమానికి దాడులు జరిగాయి. అదే సమయంలో మహావీర్​ భార్య సోనమ్​... పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భారత మెరుపుదాడుల్లో ప్రధాన అస్త్రంగా నిలిచిని మిరాజ్​ విమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా తన బిడ్డకు 'మిరాజ్​ సింగ్ రాఠోడ్​​' అని పేరు పెట్టారు.

మహవీర్​ సింగ్​ తమ్ముడు భూపేంద్ర సింగ్​ ప్రస్తుతం ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. మహవీర్ కూడా ఆర్మీలో బాధ్యతలు నిర్వర్తించి రిటైరయ్యారు. ఇలా వీరి కుటుంబం దేశ భద్రత కర్తవ్యాల్లో మమేకమవడం వల్ల ఈ పేరు పెట్టేందుకే నిర్ణయించామని కుటుంబీకులు తెలిపారు. స్థానిక యువత రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు మిరాజ్​ పేరు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రకటించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.