పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్ర శిబిరంపై దాడి చేసింది భారత వాయుసేన. ఇందుకు మిరాజ్ యుద్ధ విమానాల్ని ఉపయోగించారు. మంగళవారం తెల్లవారుజామున చేపట్టిన ఈ ఆపరేషన్‌ను పాక్ సైన్యం గుర్తించింది.
మిరాజ్‌ను నిలువరించేందుకు ఎఫ్-16 యుద్ధ విమానాల్ని పంపింది పాకిస్థాన్ వాయుసేన. అయితే ఏకకాలంలో బహుళ దాడులు చేయగల మిరాజ్ ముందు నిలబడలేక తోకముడిచాయి.
ఈ ఆపరేషన్‌లో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని భావిస్తున్నారు.