జమ్ముకశ్మీరులోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది, జవాను మృతిచెందారు. మరొక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు అతడిని సమీప అసుపత్రికి తరలించారు.
జిల్లాలోని రత్నిపొర ప్రాంతంలో ముష్కరులున్నట్టు వచ్చిన సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేప్టటారు. ఈ నేపథ్యంలో బలగాలపై తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సైనికులు ముష్కరులకు దీటుగా జవాబిచ్చారు. సమీప ప్రాంతాల్లో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.