అనారోగ్యంతో బాధపడుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను శనివారం రాత్రి గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు.
ఉదర సంబంధ వ్యాధితో బాధపడుతోన్న పారికర్‌కు వైద్యులు ఎండోస్కోపీ పరీక్షలు చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే మరో 48 గంటల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారని సీఎం కార్యాలయం తెలిపింది.
ఆసుపత్రికి చేరుకున్న గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, పారికర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబుచేశారు.
"నేను ముఖ్యమంత్రి పారికర్‌తో మాట్లాడాను. ఆయన కేవలం వైద్య పరీక్షల కోసం వచ్చారు. రేపు ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటారు."
- విశ్వజిత్ రాణే, గోవా ఆరోగ్యశాఖ మంత్రి
క్లోమ గ్రంథి సంబంధిత వ్యాధికి గురైన 63 ఏళ్ల పారికర్ అమెరికా, దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.