ఘటన జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం అందినా చర్యలు ఎందుకు తీసుకోలేదని మమతా బెనర్జీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
"ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారా...ఇలాంటి ఘోర ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకుండా అమిత్‌షా, మోదీ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి ముందుగానే సమాచారం ఉంది. అయినా ఇంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది." -మమతా బెనర్జీ, బెంగాల్ సీఎం
పఠాన్‌కోట్ ఉగ్రదాడి అనంతరం ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు మందు దేశంలో యుద్ధ వాతావరణాన్ని తీసుకురావాలని చూస్తోందని మమత ఆరోపించారు.
'ఎవరి ప్రోద్బలంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ ఇలాంటి ఘటనకు పాల్పడింది, గత ఐదేళ్లలో పాకిస్థాన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు' ఈ విషయాలపై తమకు అనుమానాలున్నాయని స్పష్టం చేశారు మమత.
ఆర్ఎస్, విహెచ్పీ, భాజపా కలిసి దేశంలో విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని దీదీ విమర్శించారు. పుల్వామా ఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.