కేంద్ర ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పుల్వమా ఉగ్రదాడిపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, జవాన్ల మరణానికి కారణమైందని ఆమె ఆరోపించారు.తృణమూల్ కాంగ్రెస్ కోర్‌కమిటి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియంత మోదీని గద్దె దించడమే లక్ష్యమని ప్రకటించారు. పశ్చిమ్‌బంగలో తృణమూల్ 42 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మోదీ-అమిత్ షా సోదరుల చేతిలో ఉందని, మంత్రి వర్గం సొంత నిర్ణయాలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం మెషిన్ల ట్యాంపరింగ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నందున తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.