2019-20 మధ్యంతర బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో మెజారిటీ సభ్యులు బడ్జెట్‌కు అనుకూలంగా ఓటేసినందున స్పీకర్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు.
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, సీపీఐ, ఎన్సీపీ పార్టీల ఎంపీలు సభనుంచి వాకౌట్ చేశారు.
కాంగ్రెస్ సభ్యుల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దాల మేడల్లో నివసించే వారికి రూ.2 వేల విలువ తెలియదు, అందుకే 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.
" గత నాలుగున్నరేళ్లుగా పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. 2019-20 మధ్యంతర బడ్జెట్ వారి అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది. కాంగ్రెస్‌తో పోలిస్తే మా ప్రభుత్వ పని తీరు చాలా భిన్నంగా ఉంది. మోదీ ప్రభుత్వం నిజాయతీగా పనిచేస్తోంది. దేశంలోని నకిలీ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిజాయతీ పరులను రక్షించడానికి మా ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోంది."
-పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి