మరోసారి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషిరా సెక్టార్ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెగబడినట్లు సైన్యాధికారి వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాతంలో తక్కువ సామర్థ్యం ఉన్న ఆయుధాలతో పాక్ దాడికి పాల్పడగా భారత సైన్యం తిప్పికొట్టింది.
సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకన్నప్పటికీ పాక్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచే పాకిస్థాన్ బలగాలు తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తున్నాయి. ప్రధానంగా జమ్మూకశ్మీర్లో ఎక్కువగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
2018లో అత్యధికంగా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. గత 15 ఏళ్లల్లో పాక్ ఆర్మీ 2,936 సార్లు కాల్లుల విరమణను ఉల్లంఘించింది.