పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బంగ, రాజస్థాన్... ఇలా రాష్ట్రం ఏదైనా... పరిస్థితి ఒక్కటే. ప్రతి అమరుడి నివాసం వద్ద వాతావరణం ఒక్కటే. కుటుంబీకుల ఆర్తనాధాలతో విషాదఛాయలు అలుముకున్నాయి. త్రివర్ణ జెండా కప్పిన కుమారుల శవపేటికలను చూసిన తల్లుల హృదయాలు ముక్కలయ్యాయి. 'భారత్ మాతాకి జై... వందేమాతరం' నినాదాల మధ్య బంధువులు, స్థానికులు మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
అమర వీరులకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఎక్కడికక్కడ వేలాది మంది తరలివచ్చారు. జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. జైపుర్లో తన తండ్రి చితికి నిప్పంటించిన రెండేళ్ల చిన్నారుడి పరిస్థితి చూసిన ప్రజలు విలపించారు. ఒడిశాలో వేల మంది విద్యార్థులు సైనికులు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.