గతంలో ఏం జరిగింది?
2016 లో గూడఛర్యం ఆరోపణలతో బలూచిస్థాన్ ప్రాంతంలో పాక్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొంది. కేసును విచారించిన పాక్ సైనిక కోర్టు జాదవ్‌కు ఉరిశిక్ష విధించింది.
దీనిని వ్యతిరేకిస్తూ భారత్, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2017లో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు జాదవ్ ఉరిని ఆపాలంటూ పాక్‌కు ఐసీజే అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ కేసులో వాదనలు ప్రారంభం కానున్నాయి. సోమవారం భారత్, మంగళవారం పాక్ వాదనలు వినిపించనున్నాయి. భారత్ తరఫున దిల్లీకి చెందిన న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
పాక్ ఎందుకు అరెస్ట్ చేసింది?
జాదవ్ భారత నిఘా సంస్థకు చెందిన వారని, అఫ్ఘానిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. జాదవ్‌ను పాక్ అపహరించి అక్రమంగా కేసు బనాయించిందని భారత్ వాదిస్తోంది.
'వియన్నా' ఒప్పందాన్ని ఇస్లామాబాద్ అతిక్రమించిందని ,జాదవ్‌ను చిత్రహింసలకు గురిచేస్తోందని భారత్ పేర్కొంది. కుల్ భూషణ్ కుటుంబం కలవడానికి వెళ్లినప్పుడూ పాక్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని భారత్ మండిపడింది.