ETV Bharat / bharat-news

జాదవ్​ కేసు విచారణ వాయిదా - జాదవ్​ కేసు విచారణ

పాక్​ నిర్బంధంలో ఉన్న కుల్​భూషణ్ జాదవ్​ కేసు విచారణను అంతర్జాతీయ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

జాదవ్​ కేసు విచారణ వాయిదా
author img

By

Published : Feb 18, 2019, 10:02 PM IST

పాక్​ చెర నుంచి కుల్​భూషణ్​ జాదవ్​ను విడుదల చేయాలని భారత్​ వేసిన పిటిషన్​పై విచారణను అంతర్జాతీయ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వియన్నా కన్వెన్షన్​ తీర్మానాలు తుంగలో తొక్కి అంతర్జాతీయ ప్రమాణాలకు పాకిస్థాన్ ఎగనామం పెట్టిందని భారత్​ తరఫు న్యాయవాది హరీశ్​ సాల్వే ఆరోపించారు.

జాదవ్​తో మాట్లాడేందుకు అనుమతి కోసం భారత్​ 13 సార్లు ప్రయత్నించినా పాక్​ స్పందించలేదని కోర్టుకు వివరించారు సాల్వే. పాకిస్థాన్​ వైఖరి చూస్తుంటే జాదవ్​కు న్యాయం జరిగేలా కన్పించట్లేదని సాల్వే వ్యాఖ్యానించారు. పాక్​ మిలిటరీ కోర్టులు అందుకు సుముఖంగా లేవన్నారు. జాదవ్​ను బలూచిస్థాన్​లో తమ ఏజెంట్​గా చూపిస్తూ భారత్​కు వ్యతిరేకంగా కథ అల్లడానికి పాక్​ ప్రయత్నిస్తోందని సాల్వే కుండబద్దలు కొట్టారు.

అందుకే జాదవ్​ నిర్బంధాన్ని రద్దు చేసి తక్షణమే విడుదల చేయాలని భారత్​ కోరుతోందని సాల్వే కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేస్తూ ది హేగ్​ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

జాదవ్​ కేసు విచారణ వాయిదా
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.