కశ్మీరీ విద్యార్థులపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు స్పందించట్లేదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. పుల్వామా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపలేమని అభిప్రాయపడ్డారు.
పుల్వామా దాడులపై సమాధానం బెబుతామని ప్రధాని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి జవాబు సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలకు భద్రత ఉపసంహరించటంపైనా స్పందించారు.
రాజకీయ నాయకులకు భద్రత ఉపసంహరించటం ఒక తిరోగమన చర్య. గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలించాలి. నాకు తెలిసినంత వరకు నిఘా, భద్రతా వర్గాలు ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వవు. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోకపోతే న్యాయస్థానాలను సంప్రదిస్తాం. -ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
కశ్మీరీలు భారతీయులు కాదా?
మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కశ్మీరీ వస్తువుల బహిష్కరణకు మద్దతిచ్చినట్లు మేఘాలయ గవర్నర్ వ్యాఖ్యలతోపాటు కశ్మీర్ విద్యార్థులపై దాడి జరగలేదన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
" class="align-text-top noRightClick twitterSection" data="కొందరు కశ్మీర్‌ను భారత్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారు కానీ కశ్మీరీలను భారతీయుల్లో భాగం కావాలని కోరుకోవటం లేదు. ఇదేం వింత పరిస్థితో అర్థం కావట్లేదు. - ట్విట్టర్లో చిదంబరం.
The irony of the situation is depressing. We want Kashmir to be part of India, but we do not want Kashmiris to be part of Indians.
— P. Chidambaram (@PChidambaram_IN) February 21, 2019
">The irony of the situation is depressing. We want Kashmir to be part of India, but we do not want Kashmiris to be part of Indians.
— P. Chidambaram (@PChidambaram_IN) February 21, 2019
The irony of the situation is depressing. We want Kashmir to be part of India, but we do not want Kashmiris to be part of Indians.
— P. Chidambaram (@PChidambaram_IN) February 21, 2019