జమ్మూకశ్మీర్ నియంత్రణరేఖ వద్ద భారత వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. 1000 కిలోల బాంబులతో జైషే మహ్మద్ స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోయ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం దాడికి పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో అని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోవడం ఏ పరిణామానికి దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
"పాకిస్థాన్ కచ్చితంగా సమాధానమిస్తుందన్న పాక్ ప్రధాని ప్రకటనే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. పాక్ ఎక్కడి నుంచి ఎలా స్పందిస్తుంది? ఒకవేళ పాక్ దాడి చేస్తే భారత్ తిరిగి స్పందిస్తుందా?"
- ఒమర్ ఆబ్దుల్లా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి
" ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడితో ముగుస్తాయని ఆశిస్తున్నాం. ఒక వేళ ఇలాగే కొనసాగితే నియంత్రణ రేఖకు ఇరువైపులా నివాసముంటున్న ప్రజలే ఎక్కవ ఇబ్బంది పడతారు."
-అబ్దుల్ గనీదార్, స్థానికుడు
ఈ ఉదయమే దాడి
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకల పనిపట్టింది. మంగళవారం ఉదయం 3 గంటల 30 నిమిషాల సమయంలో 12 మిరాజ్ - 2000 జెట్ ఫైటర్స్‌తో ఉగ్రశిబిరాలపై 1000 కిలోల బాంబుదాడి చేసింది.