ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం గంగా హారతిలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
అరుదైన సన్నివేశం
ప్రయాగ్రాజ్లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు ప్రధాని. స్వయంగా కండువాతో శుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి గుర్తింపుగా ఇలా చేశారు.