జార్ఖండ్ బోకారోలో నిర్మాణంలో ఉన్న వంతెనపై మావోయిస్టులు బాంబుదాడి చేశారు. ఒక జేసీబీ, ట్రాక్టర్ సహా కాంక్రీట్ కలిపే రెండు యంత్రాలకు నిప్పంటించారు. వంతెనకోసం పనిచేస్తున్న కార్మికులపై కూడా దాడికి పాల్పడ్డారు. లోధి, కొదావా ప్రాంతాల మధ్య సిటోహోట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మావోయిస్టు 'మిథిలేష్ మహాటో' బృందానికి చెందిన 10మందికి పైగా నక్సల్స్ ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన దాదాపు 12గంటల అనంతరం సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిపై స్థానికులను ఆరా తీశారు.
మావోల దాడి నేపథ్యంలో రాత్రి పూట వంతెన పనికి దూరంగా ఉండాలని అధికారులకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆర్ రామ్‌కుమార్ సూచించారు.