ఉత్తరప్రదేశ్ సహ్రాన్‌పూర్ జిల్లాలో ఇద్దరు తీవ్రవాదులను ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ జైషే మహమద్ సంస్థకు చెందినవారుగా అనుమానాలున్నాయని యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.
అరెస్టయిన వారిలో కుల్గాం జిల్లాకు చెందిన షానవాజ్ అహ్మద్ తెలి, పుల్వామాకు చెందిన అక్విబ్ అహ్మద్ మాలిక్‌గా గుర్తించారు. వీరిద్దరూ జైషేలో నియామకాలు చేస్తున్నారని డీజీపీ తెలిపారు. అయితే పుల్వామా దాడిలో వీరి పాత్రపై దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు.