జమ్ము కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు-ఉగ్రమూకలకు మధ్య జరిగిన కాల్పుల్లోముగ్గురుఉగ్రవాదులనుబలగాలు మట్టుబెట్టాయి. ఓ పోలీసు అధికారి వీరమరణం పొందారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి .
భద్రతా బలగాలు కుల్గామ్ తురిగాంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
చనిపోయిన పోలీసు అధికారి డీఎస్పీ అమన్ తాకుర్ అని అధికారులు తెలిపారు.