ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను సమర్థించేలా ఉండకూడదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అభిప్రాయాలు, ప్రకటనలు జారీ చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.
భద్రతా దళాల త్యాగాలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని దిల్లీలో సమావేశమైన అనంతరం ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాల వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. వరుస ట్వీట్లు చేశారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""దేశమంతా ఒకే గొంతుక వినిపిస్తున్నపుడు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఎందుకు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా, దేశమంతా ఒకే స్వరం వినిపించాలి. మీరు చేసే అవివేకమైన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఆసరాగా తీసుకుంటుంది."
-ట్విట్టర్లో అరుణ్ జైట్లీ
My appeal to India’s opposition - “Let the country speak in one voice”. Please introspect - “Your ill advised statement is being used by Pakistan to bolster its case”.
— Arun Jaitley (@arunjaitley) February 27, 2019
">My appeal to India’s opposition - “Let the country speak in one voice”. Please introspect - “Your ill advised statement is being used by Pakistan to bolster its case”.