భారత సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపుదాడులు చేసింది. జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వాయుసేన విరుచుకుపడింది. బాలాకోట్‌లోని అతిపెద్ద జైషే ఉగ్రవాద స్థావరాన్ని సైన్యం ధ్వంసం చేసింది. బాలాకోట్ స్థావరం యూసఫ్ అజర్ నేతృత్వంలోనిది.
ఎవరీ యూసఫ్ అజర్?
ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలోని యూసఫ్ అజర్ జైషే అహ్మద్ అధినేత మసూద్ అజర్‌కు స్వయానా బావా. 1999లో ఐసీ-155 విమాన హైజాక్‌తో సహాపలు ఉగ్రదాడుల్లో కీలక సభ్యుడు యూసఫ్. పాకిస్థాన్ జాతీయుడైన యూసఫ్ భారత సైన్యం చేసిన మెరుపుదాడిలో హతమైనట్టు విశ్వసనీయ సమాచారం.
ఇతనితోపాటు కశ్మీర్ వ్యవహారాల బాధ్యుడు ముఫ్తీ అజహర్ ఖాన్ కశ్మీరీ హతమైనట్లు తెలుస్తోంది.