ఆరుగురు వేర్పాటువాదులకు ఇప్పటి వరకు కల్పించిన వాహనాలు, భద్రతా సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఉపసంహరిస్తున్నారు. ఇకపై ఈ ఆరుగురితోపాటు, ఇతర వేర్పాటువాదులకు ఏ కారణంతోనూ ఎలాంటి భద్రత కల్పించరు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం జమ్ముకశ్మీర్లో పర్యటించారు. పాకిస్థాన్ ప్రేరేపిత వేర్పాటువాదులపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ ద్వారా నిధులు పొందుతూ దేశద్రోహానికి పాల్పడుతున్న వారిని గుర్తించాలన్నారు.