శారద కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సతీమణి నళిని చిదంబరానికి పశ్చిమ బంగ హైకోర్టులో ఊరట లభించింది. ఆరు వారాల పాటు సీబీఐ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది.
కేసు విచారణకు సహకరించాలని నళిని చిదంబారానికి న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇరువురి వాదనల ప్రమాణ పత్రాలను కోర్టులో సమర్పించాలని నళిని చిదంబరం, సీబీఐలకు బెంగాల్ హైకోర్టు సూచించింది.
శారద చిట్ఫండ్ ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన 1.3కోట్ల రూపాయలు నళిని చిదంబరానికి చెల్లించారని సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది.
ఐతే ఆ డబ్బును న్యాయ సలహాదారు రుసుముగా నళిని చిదంబరానికి మనోరంజన సింగ్ చెల్లించారని నళిని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.