భారత వైమానిక దళంలో అత్యంత శక్తిమంతమైన మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో పాక్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది. బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహమ్మద్ ఉగ్ర తండాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. పుల్వామా ఘటనతో దెబ్బతిన్న పులిలా ఉన్న భారత్ పంజా విసురుతుందని పాక్ భయపడుతోన్నా... పైకి ప్రగల్భాలు పలికింది. ఈ రోజు మెరుపు దాడితో దాయాది దేశం ఖంగుతింది. ఈ మెరుపుదాడుల్లో 300 మందికిపైగా ముష్కరులు మృతిచెందినట్లు సమాచారం.
ఎలా జరిగింది...?
పక్కా ప్రణాళికతో కేవలం ముష్కరులే లక్ష్యంగా భారత వైమానిక దళం దాడి చేసింది. బాలాకోట్‌లో ఉన్న మొత్తం జైషే మహమ్మద్ సంస్థ శిక్షణా శిబిరంపై ముప్పేట దాడి చేసింది. దాయాది దేశం ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 21 నిముషాల్లో శిబిరాలు నేలమట్టమయ్యాయి. భారత్‌లో పలుచోట్ల పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడి చేద్దామనుకున్న ఉగ్రమూకపై భారత్ జరిపిన మెరుపు దాడిలో దాదాపు 300కు పైగా ముష్కరులు అంతమొందినట్లు సమాచారం.
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వైమానిక ఆపరేషన్ గురించి ప్రధాని మోదీకి వివరించారు. అనంతరం భద్రతా వ్యవహారాలపై మోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి హాజరయ్యారు.
భద్రతా వ్యవస్థ హైఅలర్ట్
దాడి అనంతరం పాక్ ప్రతిదాడి చేసే అవకాశం ఉన్నందున భారత వైమానిక దళం పశ్చిమ ప్రాంతంలోని అన్ని స్థావరాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
మోదీ చెప్పినట్టుగా..
పుల్వామా దాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందే చెప్పారు. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే పుల్వామా ఘటన అనంతరమే మెరుపు దాడిపై ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
ఖండించిన పాక్...
భారత వైమానిక దాడిపై మొదటగా పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. భారత్ మెరుపు దాడి చేసినట్లు ఒప్పకున్నప్పటికీ వెనువెంటనే పాక్ సైన్యం ప్రతిస్పందించిందని గఫూర్ చెప్పుకొచ్చారు. పాక్ ప్రతిదాడితో భారత్ విమానాలు వెనుదిరిగిపోయాయని ట్వీట్ చేశారు.
Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage.
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage.
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage.
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019
భారత సైన్యం ట్వీట్...
మెరుపు దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత భారత సైన్యం ఓ పద్యాన్ని ట్వీట్ చేసింది.
'क्षमाशील हो रिपु-समक्ष
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।
सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।'#IndianArmy#AlwaysReady pic.twitter.com/bUV1DmeNkL
">'क्षमाशील हो रिपु-समक्ष
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 26, 2019
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।
सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।'#IndianArmy#AlwaysReady pic.twitter.com/bUV1DmeNkL'क्षमाशील हो रिपु-समक्ष
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 26, 2019
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।
सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।'#IndianArmy#AlwaysReady pic.twitter.com/bUV1DmeNkL
"శత్రువు ముందు బుద్ధిగా, మర్యాద పూర్వకంగా ఉంటే నిన్ను పిరికిపందగా చూస్తారు. ఎలా అంటే పాండవులను కౌరవులు చూసినట్టుగా..." అంటూ పద్యం సాగిపోతోంది.