పుల్వామా దాడి తరువాత పొరుగుదేశం పాకిస్థాన్‌కు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో భారత్ అన్వేషణ ప్రారంభించింది. దేశ సైనిక బలం, ఆయుధ సామగ్రి వంటి వాటిపై దృష్టి సారించింది. ఒక దేశం పరాక్రమానికి దోహదం చేయడంలో కీలకమైనదిగా భావించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.
సైనిక బలాన్ని తెలిపే కొన్ని అంశాలు:
* దేశంలో ఉన్న ఆయుధ సామగ్రి
* రక్షణ బడ్జెట్
* అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించడానికి వీలైన ప్రదేశాలు
* రాజకీయ నాయకత్వం, నిర్ణయాధికారం
సైనిక బలంలో ఎవరెక్కడ?
సైనిక బలం, ఆయుధాలు, యుద్ధ విమానాలు వంటి అంశాల్లో అమెరికాదే మొదటి స్థానం. ఆయుధాలపై పరిశోధన, సాంకేతికత వినియోగంలోనూ అగ్రరాజ్యానిదే అగ్రస్థానం. కానీ సైనికుల బలంలో మాత్రం చైనాది మొదటి స్థానం. మిగిలిన అంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం డ్రాగన్ దేశం రెండో స్థానానికి పరిమితమైంది. ఎంత మంది సైనికులు ఉన్నారనేదీ నిర్ణయాత్మక అంశంగా ఉంటుంది.
అమెరికా | రష్యా | చైనా | భారత్ | పాకిస్థాన్ | |
సైనిక బలం |
12, 81, 900 |
10, 13, 628 |
21, 83, 000 |
13, 62, 500 |
6, 37, 000 |
యుద్ధ విమానాలు |
13, 362 |
3, 914 |
3, 035 |
2, 185 |
1, 281 |
ఆర్మీ హెలికాఫ్టర్లు |
5, 758 |
1, 451 |
985 |
720 |
328 |
యుద్ధ ట్యాంకులు |
5, 884 |
20, 300 |
7, 716 |
4, 426 |
2, 182 |
సాయుధ నౌకలు |
415 |
352 |
714 |
295 |
197 |
అణ్వాయుధాలు |
6550 |
4350 |
280 |
135 |
145 |
రక్షణ బడ్జెట్ లక్షల కోట్లలో |
42.31 |
9.7 |
15.25 |
3.05 |
1 |
అంతర్జాతీయంగా అమెరికా అగ్రస్థానంలో ఉంటే తరువాతి స్థానంలో రష్యా, చైనాలు ఉన్నాయి. భారత్‌ది నాలుగో స్థానం. పాకిస్థాన్ 17వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ కన్నా దిగువన ఉంది.
భారత్, పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పాకిస్థాన్ ఎప్పటికప్పుడు అణ్వాయుధాల విషయంలో నాటకీయంగా వ్యవహరిస్తోంది. అణ్వాయుధాలను వినియోగించాల్సిన అవసరం ఇప్పటివరకు భారత్‌కు రాలేదు. అది ప్రస్తుత పరిణామాల ప్రభావంతో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.