బాలాకోట్ మెరుపుదాడులపై భారత్లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారమిచ్చింది విదేశాంగ శాఖ. జైషే మహ్మద్ అతిపెద్ద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేసినట్లు వివరించింది. పాక్ సైన్యానికి, సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టంచేసింది.
విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, ఇతర అధికారులు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్థాన్, భూటాన్, టర్కీ సహా వివిధ దేశాల రాయబారులకు వాయుదాడిపై సమాచారమిచ్చారు.
"భారత ప్రభుత్వం అతి త్వరగా ఏం జరిగిందో మాకు సమాచారమిచ్చింది. మేం మా ప్రభుత్వాలకు సమాచారమిస్తాం. ఏం చేయాలో మా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి"
-హాన్స్ డాన్నెస్, డిప్లోమాటిక్ కార్ప్స్ డీన్