పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై స్పందించారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. అణు యుద్ధం వాదనలను కొట్టిపారేశారు. యుద్ధం అనేది సాధారణ విషయం కాదని, సైన్యం ముందస్తు వ్యూహాలు తప్పనిసరిగా ఉంటాయన్నారు.
ఒకవేళ యుద్ధం జరిగి భారత్‌పై పాక్ ఒక్క అణుబాంబు ప్రయోగిస్తే... బదులుగా ఆ దేశం 20 అణుబాంబులతో తీవ్రంగా విరుచుకుపడుతుందన్నారు ముషారఫ్.
దుబాయ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాకిస్థాన్‌లో ఓ పత్రిక కథనం ప్రచురించింది.
ముందుగానే 50 వేయాలి..
ఒకవేళ అణు యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్థాన్ ముందుగా భారత్‌పై ఒకేసారి 50 అణుబాంబులను ప్రయోగించడం ఒక్కటే మార్గమని తెలిపారు ముషారఫ్.
1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ సైన్యానికి నాయకత్వం వహించారు ముషారఫ్. 1999 నుంచి 2008 వరకు ఆయన పాక్ అధ్యక్షుడిగా ఉన్నారు.
బెనజీర్ బుట్టో హత్య కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్.. 2016నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు.