ETV Bharat / bharat-news

ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని​ షోపియన్​ జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్​ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

author img

By

Published : Feb 27, 2019, 9:45 AM IST

జమ్ముకశ్మీర్​లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్​లోని​ షోపియాన్​ జిల్లాలో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఫైరింగ్​లో ఇద్దరు జైషే మహమ్మద్​ ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మీమేందార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సైనికులు తనిఖీలు చేపట్టారు. భారత బలగాల ఉగ్రవేటతో అప్రమత్తమైన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.

జైషే మహమ్మద్​ ఉగ్రమూకల శిబిరాలపై భారత్​ వైమానిక దళం మంగళవారం బాంబుల దాడి చేసింది. నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలోని బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. సైనిక దాడిలో చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలొస్తున్నా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

1971 భారత్​-పాక్​ యుద్ధం తర్వాత భారత వైమానిక దళం నియంత్రణ రేఖ దాటి దాడి చేయడం ఇదే తొలిసారి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.