ETV Bharat / bharat-news

"పైలట్ క్షేమంగా వస్తారు" - జైష్​ ఏ మహమ్మద్

పాక్​లో బందీగా ఉన్న తన కుమారుడు (భారత వింగ్ కమాండర్​) సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు అతని తండ్రి తెలిపారు. తన కుమారుడు నిజమైన సైనికుడిలా మాట్లాడాడని, అతనిని చూసి జాతి గర్వ పడుతుంటే తనకెంతో గర్వంగా ఉందన్నారు మాజీ ఎయిర్ మార్షల్​ అయిన పైలట్ తండ్రి.

పాక్​లో బందీగా ఉన్న భారత్​ పైలెట్​ క్షేమంగా తిరిగిరావాలని భారత ప్రజల ఆకాంక్ష
author img

By

Published : Feb 28, 2019, 5:11 PM IST

దేశం కోసం ధైర్యసాహసాలతో పోరాడుతున్న కుమారుడ్ని చూసి చాలా గర్వపడుతున్నట్లు పాక్​ చెరలో చిక్కుకున్న భారత్​ పైలెట్​ తండ్రి పేర్కొన్నారు. తన కుమారుడు సురక్షితంగా తిరిగి భారత్​కు చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న 'భారత పైలట్​' వీడియోపై స్పందించిన ఈ రిటైర్డ్​ ఎయిర్​ మార్షల్, తన కుమారుడు నిజమైన సైనికుడిలా మాట్లాడాడని పేర్కొన్నారు.​

"మాకు మద్దతుగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు. ఆ దేవుడు చల్లని ఆశీస్సులు అందించాడు. తను బతికే ఉన్నాడు. ఎలాంటి గాయాలు కాలేదు. నిలకడగానే ఉన్నాడు. అతను నిజమైన సైనికుడిలా ధైర్యంగా మాట్లాడాడు. తనను చూసి మేము గర్వపడుతున్నాము." _ పాక్​ చెరలోని భారత్​ పైలట్ తండ్రి, రిటైర్డ్​ ఎయిర్​ మార్షల్​

సురక్షితంగా విడుదలవుతారు

పాక్​ చెరలో చిక్కుకున్న భారత పైలట్​ సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారని, గతంలో పాకిస్థాన్లో భారత రాయబారిగా పనిచేసిన జి. పార్థసారథి తెలిపారు. కార్గిల్​ యుద్ధంలో పాక్​ బందీగా చిక్కిన భారత వైమానిక దళ పైలట్ కె.నచికేత​ను సురక్షితంగా విడిపించడంలో పార్థసారథి ప్రముఖ పాత్ర వహించారు.

"తను (భారత పైలెట్)​ సురక్షితంగా భారత్​కు చేరుకుంటారని నమ్ముతున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. పాక్​ జెనీవా ఒప్పందం(1929)పై సంతకం చేసింది. కనుక దానిని ఉల్లంఘించలేదు."
-జి.పార్థసారథి, పాక్​లో భారత మాజీ రాయబారి

ఇదీ జరిగింది

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్​ జైష్​ ఏ మహమ్మద్​ స్థావరాలపై దాడి చేసింది. దీనికి ప్రతిగా పాక్ భారత భూభాగంపై వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడులను సమర్థంగా భారత్​ తిప్పికొట్టి పాక్​ యుద్ధవిమానాన్ని నేలకూల్చింది. ఇదే సమయంలో భారత్​ తన మిగ్​ యుద్ధ విమానాన్ని కోల్పోయింది. అందులోని భారత పైలట్​ను పాక్​ బందీగా పట్టుకుంది.

undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.