లోక్పాల్ చట్టం కోసం పోరాడుతోన్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పుల్వామా ఘటనపై స్పందించారు. తన పూర్వపు ఉద్యోగమైన ఆర్మీ డ్రైవర్గా పనిచేసేందుకు ఇప్పటికీ సిద్ధమేనని తెలిపినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
"నేను వయోభారం రీత్యా ఆయుధాన్ని ఉపయోగించలేను. కానీ అవసరమైతే దేశం కోసం పోరాడుతున్న ఆర్మీకి వస్తు సామగ్రినందించేందుకు ఇప్పటికీ సిద్ధమే." -అన్నాహజారే
లోక్పాల్ చట్టాన్ని తెస్తామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హామీతో.. ఫిబ్రవరి 5న తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు హజారే. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.