దిల్లీలో వస్తు సేవల పన్ను మండలి 33వ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో నిర్వహించారు. స్థిరాస్తి, లాటరీల పన్నుల ఖరారే ప్రధాన అజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ అంశంపై నిర్ణయాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది జీఎస్టీ మండలి.
ఐటీ రిటర్న్‌ల దాఖలు రద్దీ ఎక్కువగా ఉన్నందున గడువు పెంచుతున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అన్ని రాష్ట్రాలకు ఈ నెల 22 వరకు, జమ్ముకశ్మీర్‌కు 28 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపారు. సేల్స్ రిటర్న్ ( జీఎస్టీఆర్-3బి)కి ఈ నెల 20 వరకు గడువు ఉందన్నారు.