తూర్పుకోస్తా రైల్వే ఒడిశాలో మొదటిసారి ప్రయోగాత్మకంగా 2 కిలోమీటర్లు పొడవైన రైలు నడిపింది. రైలు రవాణాను తక్కువ మానవ వనరులు, తక్కువ ఖర్చుతో నిర్వహించే లక్ష్యంతో ఈ ప్రయోగం చేసింది.
సాధారణ రైలులో 150 బోగీలు ఉండవు. అన్ని బోగీల ద్వారా ప్రయాణికులు, వస్తు రవాణా జరగాలంటే కనీసం 3 లేదా 4 రైళ్లు నడపాల్సి ఉంటుంది. ప్రతి రైలుకు ప్రతి స్టేషన్ దగ్గర సిగ్నల్ ఇవ్వాలి. ప్రతి క్రాసింగ్ వద్ద గేట్ వేయాలి. ఫలితంగా సమయం, మానవ, ఆర్థిక వనరులు అధికంగా అవసరమవుతాయి. దీనిని నివారించడానికి తూర్పు రైల్వే ఈ వినూత్న ఆలోచన చేసింది.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడిపిన రెండు కిలోమీటర్లు పొడవైన రైలులో 147 వ్యాగన్లు, 3 బ్రేక్/ గార్డ్ వాన్లు, 4 ఇంజిన్లు ఉన్నాయి. ముందు భాగంలో కంటెయినర్లు అమర్చిన 45 ఫ్లాట్ వ్యాగన్లు ఉంచారు. 2, 3 భాగాల్లో ఒక్కోదానికి 51 అల్యూమినయం కంటెయినర్లు అమర్చారు. ఇవన్నీ విశాఖపట్నం పోర్టుకు వెళ్లాల్సినవి.
సంబల్పూర్ రైల్వే డివిజన్లోని గోద్బాగా, బాలాంగిర్ స్టేషన్ల మధ్య ఈ రైలును ప్రయోగాత్మకంగా నడుపుతోంది రైల్వేశాఖ.