ఉద్యోగుల భవిష్య నిధి ధర్మకర్తల బృందం సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణయించారు. గత ఏడాది వడ్డీ రేటు 8.55తో పోలిస్తే ఇది స్వల్పంగా అధికం. 6కోట్ల మంది చందాదారులకు లబ్ధి చేకూరుతుందని కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ప్రతిపాదనను అమోదం కోసం ఆర్థిక శాఖకు పంపిస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈపీఎఫ్ డిపాజిట్ వడ్డీ రేటును స్వల్పంగా పెంచే అవకాశముందని సమావేశానికి ముందే విశ్లేషకులు అంచనా వేశారు.
ఆర్థికశాఖ అమోద ముద్ర వేశాక పెరిగిన వడ్డీరేటు చందాదార్ల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది.
గత ఐదేళ్లలో పీఎఫ్ వడ్డీ రేట్లు..
ఆర్థిక సంవత్సరం వడ్డీ రేటు
2017-18 8.55%
2016-17 8.65%
2015-16 8.80%
2014-15 8.75%
2013-14 8.75%