ETV Bharat / bharat-news

కొచ్చర్​కు ఈడీ సమన్లు - ఐసీఐసీఐ

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్​లకు సీబీఐ, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​లు సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు వెల్లడించారు ఆయా శాఖల్లోని అధికారులు.

కొచ్చర్​కు ఈడీ సమన్లు
author img

By

Published : Feb 22, 2019, 8:11 PM IST

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్​లకు సీబీఐ, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​లు సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు వెల్లడించారు. రూ. 3250 కోట్ల విలువైన పరపతి కేసులో పారిశ్రామిక వేత్త వీ.ఎన్​. దూత్​తో పాటు దీపక్​కూ పాత్ర ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

జనవరి 24నాటి దాడుల్లో లభ్యమైన పత్రాల ఆధారంగా సమన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా దీపక్​ కొచ్చర్​, వీ.ఎన్​.దూత్​లను హాజరయ్యేందుకు పిలవనున్నట్లు సమాచారం.

చందా కొచ్చర్​పై లుక్​ అవుట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. గత మార్చిలో దీపక్​, వీ.ఎన్. దూత్​లకు వ్యతిరేకంగా లుక్​ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఎఫ్​ఐఆర్ మేరకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసింది.

నీకిది-నాకది తరహాలో జరిగిన వ్యవహారంలో దీపక్​ కొచ్చర్​కు చెందిన న్యూపవర్ రిన్యూయబుల్స్​లో రూ. 64 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం ఎవరినైనా విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.

కొచ్చర్, వీ.ఎన్. దూత్​లకు చెందిన భారత, విదేశాల్లోని ఆస్తుల లెక్కల్ని సైతం బయటికి తీస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Seoul (South Korea), Feb 22 (ANI): Prime Minister Narendra Modi on Friday expressed his gratitude towards South Korean President Moon Jae-in for latter's condolences on Pulwama terror attack, and said that a Memorandum of Understanding (MoU) signed between the two countries would further take forward their agenda on counter-terrorism."I express my gratitude to President Moon for his condolences on Pulwama terror attack and support against terror. MoU signed between the two countries today will further take forward our counter-terrorism agenda," PM Modi said in a joint statement in Seoul.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.