రాజస్థాన్ బికనేర్‌లోని కోలాయత్ భూ కుంభకోణం కేసులో రాబర్ట్ వాద్రా కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాద్రా కంపెనీలకు చెందిన రూ.4.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపింది. స్కై లైట్ హాస్పిటాలిటి సహా ఇతర కంపెనీలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
కోలాయత్ భూకుంభకోణానికి సంబంధించి రాజస్థాన్ పోలీసులు 18 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత 2015లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అన్ని కేసుల్లోనూ జై ప్రకాశ్ బగర్వాను నిందితుడిగా పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ ఇటీవల కొన్ని గంటల పాటు విచారించింది.