ETV Bharat / bharat-news

నీరవ్​మోదీ ఆస్తులు జప్తు - ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

రూ.177 కోట్ల విలువైన నీరవ్​ మోదీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముంబయి, సూరత్​ల్లోని సంపద స్వాధీనం చేసుకుంది. 13వేల కోట్ల విలువైన పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ఈ వజ్రాల వ్యాపారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నీరవ్​మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
author img

By

Published : Feb 26, 2019, 4:53 PM IST

Updated : Feb 26, 2019, 7:45 PM IST

పంజాబ్ నేషనల్​​ బ్యాంక్​ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీకి చెందిన 177.72 కోట్ల విలువైన ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) జప్తు చేసింది. 'అక్రమ నగదు చెలామణి' చట్టం ప్రకారం ఈడీ నీరవ్​ ఆస్తులను జప్తు చేసింది.

నీరవ్​మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ప్రస్తుతం ముంబయి, గుజరాత్​లోని సూరత్​లో ఉన్న నీరవ్​ మోదీకి చెందిన రూ.147 కోట్ల 72 లక్షల 86 వేల 651 విలువైన స్థిర, చరాస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిలో నీరవ్​కి చెందిన భవనాలు, కర్మాగారం, అందులోని యంత్ర సామగ్రి, 8 కార్లు, నగలు, పెయింటింగ్స్​ ఉన్నాయని అధికారులు తెలిపారు.

గతంలో స్వాధీనం చేసుకున్నవి

ఇంతకుముందు నీరవ్​కు చెందిన దేశ విదేశాల్లోని సుమారు రూ.7,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అలాగే రూ.489.75 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, బులియన్​, నగలు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది.

ఇదీ అసలు కథ

నీరవ్​మోదీ పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కుంభకోణంలో సుమారు 13 వేల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్​ నేషనల్​ బ్యాంకు నుంచి నీరవ్​మోదీ సంస్థలైన సోలార్​ ఎక్స్​పోర్ట్స్, స్టెల్లార్​ డైమెండ్స్​ ఆర్​యూఎస్​లు రుణాలు పొందాయి. వీటిని అక్రమ మార్గాల్లో నీరవ్​మోదీ, అతని బంధువులు, సన్నిహితుల ఖాతాల్లోకి మళ్లించారు. ఫలితంగా పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ నష్టాల్లో కూరుకుపోయింది.

నీరవ్​ మోదీ ఆధ్వర్యంలో ఫైర్​స్టార్​ డైమెంట్​ ఇంటర్నేషనల్​ ప్రైవేట్​ లిమిటెడ్​, ఫైర్​స్టార్​ ఇంటర్నేషనల్​ ప్రైవేట్ లిమిటెడ్, రాధేషీర్​ జ్యువెలరీ కంపెనీ ప్రైవేట్​ లిమిటెడ్​, రిథమ్ హౌస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ల సంస్థలు ఉన్నాయి.

ఈ కుంభకోణంపై మొదటిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్​ఐఆర్​ నమోదుచేసింది. దీని ఆధారంగా నీరవ్​ మోదీపై, అతనికి సహకరించిన బ్యాంకు అధికారులు, సహనిందితులపై ఈడీ అక్రమ నగదు చెలామణి కేసును 2018 ఫిబ్రవరి 15న నమోదు చేసింది.

undefined

Intro:Body:Conclusion:
Last Updated : Feb 26, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.