పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ భద్రతపై సమీక్ష నిర్వహించారు.పాకిస్థాన్ సరిహద్దుల్లో రక్షణ చర్యలపై ప్రత్యేకంగాఆరా తీశారు. జమ్ముకశ్మీర్ బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం బాంబుదాడి చేసింది. అనంతరం ఈ రోజు ఉదయాన్నే పాక్ వైమానిక దళాలు భారత భూభాగంలోకి వచ్చినందున రాజ్‌నాథ్ సమీక్షకు ఆదేశించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో పాటు కేంద్ర హోంమత్రిత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సంచాలకులు రాజీవ్ జైన్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
దేశ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు వివరించారు. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచడానికి తీసుకున్న చర్యలను విశదీకరించారు.
భారత్-పాక్ సరిహద్దు భద్రతలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు మరింత జాగ్రత్తగా ఉండాలని రాజ్‌నాథ్ కోరారు.