దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దిల్లీ మెట్రో నెట్వర్క్ వ్యాప్తంగా రెడ్అలర్ట్ సైరన్‌ను మోగించింది డీఎమ్ఆర్సీ. దిల్లీ మెట్రో 327 కిలోమీటర్ల మేర 236 స్టేషన్లు కలిగి ఉంది. అన్ని స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ముంబయిలో బలగాల మోహరింపు
ముంబయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత అధికారులు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
పాఠశాలల మూసివేత
తాజా పరిణామాలతో జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు సమీప పాఠశాలలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను తెరవకూడదని ఆదేశించింది.