తమిళనాడులో అధికార అన్నాడీంఎంకే ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తిండివనమ్ ప్రాంతంలో 62ఏళ్ల రాజేంద్రన్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొంది. ఘటనాస్థలంలోనే ఎంపీ కన్నుమూశారు. డ్రైవరు సహా మరొకరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేగంగా వెళ్తున్న కారును డ్రైవర్ అదుపుచేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి:నల్ల కుక్క మాయం!
రాజేంద్రన్ మృతిపై ముఖ్యమంత్రి పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా రాజేంద్రన్ సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు.