ETV Bharat / bharat-news

దాడుల ప్రణాళిక ఇలా...

జమ్మూకశ్మీర్​ నియంత్రణ రేఖ వద్ద పక్కా ప్రణాళికతో వైమానిక దళం ఉగ్రమూకల శిబిరాలను నేలమట్టం చేసింది.

దాడుల ప్రణాళిక ఇలా
author img

By

Published : Feb 26, 2019, 11:38 AM IST

12 రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులపై ఉగ్రచర్య నీచమైనదిగా దేశమంతా ఖండించింది. ఇందుకు ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామని గట్టి సంకేతాలు పంపింది. దాడి జరిగిన మరుక్షణం నుంచి ఉగ్రవాదులకు బుద్ధి చెబుతామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్​, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు.

పలు దఫాలుగా త్రివిధ దళాధిపతులు సమావేశమై ఉగ్రవాదులపై ప్రతీకారానికి పక్కా ప్రణాళికలు రచించారు. జమ్మూకశ్మీర్​ నియంత్రణ రేఖ వద్ద వైమానిక దాడి చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగానే ఎయిర్​ ఫోర్స్​ యుద్ధ విమానాలు జమ్మూకశ్మీర్​ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. గత కొద్దిరోజులుగా ఉగ్రమూకల స్థావరాలను గమనిస్తున్నాయి.

రక్షణమంత్రి నేతృత్వంలో సోమవారం మరోసారి సమావేశమైన త్రివిధ దళాలు మంగళవారం ఉదయమే జమ్మూకశ్మీర్​లోని బాలాకోట్​, ఛకోటీ, ముజఫరాబాద్​లోని ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేశాయి.

⦁ పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదులకు గట్టి సమాధానమిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరికలు
⦁ కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రితో పలు దఫాలుగా ప్రధాని సమావేశం
⦁ ఉగ్రదాడికి ప్రతీకారంపై త్రివిధ దళాలకు ప్రభుత్వం దిశానిర్దేశం
⦁ త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి దిల్లీలో సోమవారం సమావేశం
⦁ వైమానిక దాడుల ప్రణాళికను ప్రధానికి వివరించిన జాతీయ భద్రతా సంస్థ(ఎన్​ఎస్​ఏ)
⦁ మంగళవారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.