ప్రజలు శాంతియుతంగా మెలగాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎత్తివేత గాంధీ నగర్, చన్నీ హిమ్మత్, సైనిక్ కాలనీ, త్రికుట నగర్, సత్వారీ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ రమేష్ కుమార్ ప్రకటించారు. కానీ 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టంచేశారు.
కర్ఫ్యూ పాసులుగా గుర్తింపు కార్డులు
కర్ఫ్యూ అమలులో ఉన్న ప్రాంతాల్లో పౌర సచివాలయ ఉద్యోగులు, తప్పనిసరి సేవల్లోని ఉద్యోగులు గుర్తింపు కార్డులను కర్ఫ్యూ పాసులుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యతో వరుసగా నాలుగోరోజు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. పోలీసుల అదుపులోకి 150 మంది ఇప్పటి వరకు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. పోలీసు, పారామిలిటరీ, సైన్యం భారీ సంఖ్యలో కర్ఫ్యూ ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు.
అంతర్జాల సేవల రద్దు కొనసాగింపు పుకార్లు వ్యాప్తి చెందకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతను కొనసాగిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.
పూంచ్-రావల్ కోట్ బస్ సర్వీసు రద్దు
జమ్మూలో శాంతిభద్రత దృష్ట్యా పూంచ్-రావల్ కోట్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేశారు అధికారులు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్ కోట్, పూంచ్ జిల్లాలోని చకన్ ద బాఘ్ మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతాయి. జమ్మూ కశ్మీర్, పీవోకే మధ్య రవాణాకు ఈ బస్సు సర్వీసును జూన్ 20, 2006లో ప్రారంభించారు.