"జమ్ము నగరంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. శనివారం కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి."- ఎంకే సిన్హా, ఐజీ, జమ్ము.
సామాన్యులపై బంద్ ప్రభావం
కశ్మీరీలపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారనే కారణంతో కశ్మీర్‌వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి వాణిజ్య సంస్థలు. శ్రీనగర్‌లో దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రజారవాణా, ఆటోలు, క్యాబ్‌లు రోడ్లపైకి రావటం లేదు.